- Advertisement -
చెన్నై: ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు ఆర్‌ఎస్ శివాజీ(66) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన కమల్ హాసన్‌తో అత్యధిక సినిమాల్లో నటించిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ నిర్మాత ఎంఎర్ సంతానం తనయకుడు శివాజీ, ఆయన తమిళంతో తెలుగులో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి, 100 అబద్దాలు, కోలమావు కోకిల, సూరరై పొట్రు, ధారల ప్రభు, గార్గి, లక్కీమ్యాన్ సినిమాలలో నటించారు. శివాజీ మృతిపట్ల కోలీవుడ్ ప్రముఖలు, తమిళ రాజకీయ నాయకులు సంతాపం తెలపడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read: లిఫ్టులో బిడ్డను ప్రసవించి..చెత్తకుండీలో పడేసి…
- Advertisement -