Friday, January 10, 2025

దర్వాజె పే దస్తక్ .. మెస్ వర్కర్ల ‘ఆహార జాగరణ’

- Advertisement -
- Advertisement -

కోట ( రాజస్థాన్ ): విద్యార్థుల ఆత్మహత్యల పరంపరలతో స్తంభించిన కోట కోచింగ్ హబ్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పోలీస్‌లు వినూత్న యత్నం చేపట్టారు. కోట లోని వార్డెన్లను, మెస్ వర్కర్లను , టిఫిన్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. హాస్టళ్లలో ,పిజి సదుపాయాల సెంటర్లలో ఉంటున్న విద్యార్థుల్లో ఒత్తిడి, కుంగుబాటు లక్షణాలు ఏవైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. ఈమేరకు దర్వాజే పె దస్తక్ (తలుపు తట్టడం) అనే ఉద్యమాన్ని చేపట్టారు. ఇందులో వార్డెన్లు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఏ విద్యార్థి అయినా మెస్‌కు తరచుగా హాజరు కాకపోయినా, భోజనానికి , టిఫిన్‌కు హాజరు కాకపోయినా మెస్, టిఫిన్ వర్కర్లు వెంటే ఫిర్యాదు చేయాలని సిటీ పోలీస్‌లు కోరారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో వార్డెన్లు ప్రతి విద్యార్థి గది తలుపు తట్టి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని, వారి చర్యలను గమనించాలని, వారు ఎలాంటి మనస్తాపం లో లేరని నిర్ధారించుకోవాలని కోటా ఎఎస్‌పి చంద్రశీల్ ఠాకూర్ సూచించారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలకు , నీట్ పరీక్షలకు ప్రిపేర్ కాడానికి ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు కోటాకు వెళ్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో 22 మంది విద్యార్థులు కోటా లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కోటాలో 3500 హాస్టళ్లు, 25,000 పేయింగ్ గెస్ట్ అకామడేషన్లు ఉన్నాయని కోటా హాస్టల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ మిట్టల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News