Saturday, December 21, 2024

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించిన మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ స్పందించారు. కేవలం చర్చలు, సంప్రదింపులతో మాత్రమే వేర్వేరు ప్రాంతాల్లో తలెత్తిన వేర్వేరు సంక్షోభాలను పరిష్కరించుకోగలమన్నారు. ఇక ఉగ్రవాదం, సైబర్ ముప్పులపై ప్రధాని స్పందిస్తూ … “సైబర్ ముప్పులను తీవ్రంగా పరిగణించాలి. సైబర్ ఉగ్రవాదం, ఆన్‌లైన్ రాడికలైజేషన్, మనీలాండరింగ్‌లు కేవలం ఓ చిన్నభాగం మాత్రమే. ఉగ్రవాదులు దేశాల సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే దారుణ లక్ష సాధన కోసం డార్క్‌నెట్, మెవెర్స్, క్రిప్టో కరెన్సీలను వాడుకొంటున్నారు. వార్తలపై విశ్వాసాన్ని ఫేక్ న్యూస్, డీప్ ఫేక్‌లు దెబ్బతీస్తాయి. ఇది సామాజిక అస్థిరతకు కారణమవుతుంది. సైబర్ క్రైమ్‌పై పోరాడేందుకు ప్రపంచ సహకారం అనివార్యం ” అని అన్నారు. దేశంలోగత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ స్థిరత్వం తోనే పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని మోడీ తెలిపారు. అభివృద్ధి అనేది దీనికి లభించిన బోనస్ మాత్రమేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News