Saturday, January 11, 2025

మళ్లీ కారే రావాలి.. కెసిఆర్ సారే కావాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డిలో ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్ రావుకు జననీరాజనం

రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బరిలో దిగనున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌కు స్థానిక ప్రజలు, యువత బ్రహ్మరథం పట్టారు. ఎంఎల్‌ఎ గంప గోవర్థన్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడికి చేరుకున్న కెసిఆర్‌కు కరతాళ ధ్వనులు, నినాదాలతో ఘన స్వాగతం పలికారు. ‘మళ్లీ కెసిఆరే రావాలి.. మాకు కెసిఆరే కావాలి.. కామారెడ్డికి స్వాగతం.. సుస్వాగతం’ అనే నినాదాలతో వేదిక దద్దరిల్లింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి అందరితో కరచాలనం చేస్తూ మధ్యమధ్యలో ఫొటోలకు అవకాశమిస్తూ పార్టీ కార్యకర్తలకు దారి పొడవునా అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News