Monday, December 23, 2024

తండ్రైన టీమిండియా పేసర్ బుమ్రా..

- Advertisement -
- Advertisement -

ముంబై: 29ఏళ్ల టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. సోమవారం ఉదయం బుమ్రా భార్య సంజన గణేషన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో, ఆసియా కప్ 2023లో భాగంగా ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా, భారత్ కు తిరిగొచ్చాడు.

ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన కొడుకుకు అంగద్ జస్ప్రీత్ బుమ్రా గా నామకరణం చేసినట్లు తెలిపాడు. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఈరోజు నేపాల్ జట్టుతో భారత్ తలపడనుంది. అయితే, బుమ్రా ఇండియాకు తిరిగి రావడంతో ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News