Saturday, December 21, 2024

సిద్ధిపేటలో విషాద ఘటన.. పెళ్లైన మరుసటి రోజే వరుడు మృతి

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: జిల్లాలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన మరుసటి రోజే విద్యుత్ షాక్ కు గురై వరుడు మృతి చెందిన విషాద ఘటన సిద్ధిపేట అర్బన్ మండలం వెంకటాపూర్ లో చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన తర్వాతి రోజున రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే, రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ తీగలు తగలి వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లి మరుసటి రోజే వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News