- Advertisement -
అసియా కప్ 2023లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో నేపాల్ నాలుగో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కుశాల్ బర్టెల్, ఆసిఫ్ షేక్ లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 65 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఈ క్రమంలో శార్దుల్ ఠాకూర్, కుశాల్ బర్టెల్(38)ను ఔట్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం బంతి అందుకున్న స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా చెలరేగి.. భీమ్ షార్కి(7), కుశాల్ మల్లా(2), రోహిత్ పౌడెల్(5)లను పెవిలియన్ పంపాడు. దీంతో నేపాల్ 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
- Advertisement -