- Advertisement -
భూపాలపల్లి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 36 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
- Advertisement -