Monday, December 23, 2024

నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు జి.భాస్కర్

దుబ్బాక: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ అన్నారు. సోమవారం దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఉప తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ధరల నియంత్రణ పూర్తిగా ఎత్తివేసి ఇష్టానుసారంగా ధరలు పెంచి దేశ ప్రజలను మొ సం చేస్తుందని విమర్శించారు.400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలకు పెంచి ఎన్నికల సందర్భంగా 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పూర్తిగా తగ్గిపోయిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. జి ఎస్‌టి పేరుతో ప్రతి వస్తువు పైన పన్నులు విధిస్తూ ప్రజల నుంచి టాక్సీలు వసూలు చేసి కార్పొరేట్ ధనవంతుల కొరకు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ, రాయితీలు కల్పిస్తూ దేశ సంపదను కార్పొరేట్ గంపగుత్తగా పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బిజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ అనుకూల విధానాలతో పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు.ఈ సమస్యలన్నిటి నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుల,మత వైశ్యమాల సృష్టిస్తూ ప్రజల మధ్యన గొడవల సృష్టిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని ప్రజా అనుకూలమైన పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎండి సాజిద్, మల్లేశం,రాజు,శంకర్,అల్లావుద్దీన్, మైమూద్, నర్సింలు,నగేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News