Monday, December 23, 2024

ఇస్రో కౌంట్‌డౌన్ల లేడీ సైంటిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఇస్రో సైంటిస్టు ఎన్ వలర్మతి గుండెపోటుతో శనివారం చెన్నై ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఇస్రో అధికారులు సోమవారం ఇక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. ఇస్రో పలు ప్రయోగాల కౌంట్‌డౌన్లను పలికే వలర్మతి చివరి సారిగా చంద్రయాన్ 3 ప్రయోగం దశలో తన గంభీరమైన స్వరంతో కౌంట్‌డౌన్ విధులు నిర్వర్తించింది. ఇస్రో ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్ ప్రక్రియ కూడా కీలకంగా ఉంటుంది. ప్రయోగం తుది దశలో చివరి సెకండ్లలో నిర్వర్తించాల్సిన ఒక్కో పరీక్ష దశలను నిర్థిష్ట రీతిలో సశాస్త్రీయంగా ఈ కౌంట్‌డౌన్‌లో చెప్పాల్సి ఉంటుంది. ఈ విధి నిర్వహణల బాధ్యతల్లో ఉన్న వరల్మతి తమిళనాడులోని అరియలూర్‌లో 1959 జులై 31న జన్మించారు. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ చేశారు. 1984లో ఇస్రోలో సైంటిస్టు అయ్యారు.

ఇస్రో పలు ప్రయోగాలలో ఆమె కీలక పాత్ర పోషిస్తూనే ఈ కౌంట్‌డౌన్ చెప్పడం బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు. తొలి దేశీయ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (ఆర్‌ఐఎన్‌ఎటి1) మిషన్‌కు ఆమె ప్రాజెక్టు మేనేజర్‌గా వ్యవహరించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు 2015లో అబ్దుల్ కలామ్ పురస్కారం అందించింది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వలర్మతి. నింగీనేలా యావత్తూ ఉత్కంఠ కల్గించేలా అంతరిక్ష ప్రయోగాలు ఉత్కంఠ కల్గించేలా ఉంటాయి. ఈ క్రమంలో కౌంట్‌డౌన్లు మరింత భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇటువంటి ఉద్వేగభరిత విధులను నిర్వర్తించిన మహిళ పలు అంతరిక్ష ప్రయోగాల విజయం ఆనందంతో ఉన్న దశలో ఈ విధంగా దూరం కావడం బాధాకరం అని ఇస్రో తమ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటి సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సైంటిస్టు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వలర్మతిని పలువురు ఇస్రో స్వరధుని అని పిలుస్తారు. శ్రీహరికోటలో ఇకపై జరిగే ఇస్రో ప్రయోగాల కౌంట్‌డౌన్ల దశలో ఇక ఈ స్వరం వినబడదని ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ పివి వెంకటకృష్ణన్ తమ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News