Monday, December 23, 2024

మధుయాష్కీ గౌడ్‌తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై
ఇరువురి మధ్య చర్చ

మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ ఎంపి, మధుయాష్కీ గౌడ్‌తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించారు. రానున్న రోజుల్లో వేరే పార్టీల నుంచి వచ్చే వారు ఎవరూ, వారికి ఎలాంటి సముచిత స్థానాన్ని కల్పించాలన్న దానిపై కూడా వారిద్దరూ మాట్లాడుకున్నట్టుగా తెలిసింది. కాగా బిఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటికి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కో- చైర్మన్‌గా నియమించింది. చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్‌ను గతంలోనే నియమించగా కో- చైర్మన్, కన్వీనర్‌తో పాటు 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసిసి నియమించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News