- Advertisement -
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర తొలివార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 7 వ తేదీన పెద్ద ఎత్తున పాదయాత్రలు జరుపుతుంది. దేశంలోని 722 జిల్లాల్లో పాదయాత్రలను చేపడుతారని ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు జైరామ్ రమేష్, కెసి వేణుగోపాల్ తెలిపారు. నఫ్రత్ కే బజార్ మే మెహబ్బత్ కి దుకాన్ సందేశం ఈ పాదయాత్రల ద్వారా కాంగ్రెస్ తన సందేశం వెలువరిస్తుందని నేతలు చెప్పారు. విద్వేషాలు ప్రసరింపచేసేది ఎవరు? సామరస్యం కల్పించేది ఎవరు అనే విషయం ప్రజలకు స్పష్టం అయిందన్నారు. దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ పాదయాత్రల దశలో ఎలుగెత్తి చాటుతారని, అన్ని రాష్ట్రాలలో వీటికి ఏర్పాట్లు చేశారని వివరించారు.
- Advertisement -