Saturday, December 21, 2024

ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అతులాకుతలం

- Advertisement -
- Advertisement -

సిరికొండ : బంగళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల దోణివల్ల గత రెండురోజులగా కురుస్తున్న బారీ వర్షాలు జనజీవనాన్ని అతులాకుతులం చేసింది. సిరికొండ మండలంలో ఆదివారం ఉదయం నుం డి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. గతనెల మొ దటివారంలో కురిసిన భారీ వర్షాలవల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి రొడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.పలు చె రువులు కుంటలు తెగిపోయాయి. అయితె నెల రోజుల నుండి వర్షాల జాడలేకపోవడంతో తెగిపోయిన చెరువులను, కుంటలను మరమ్మత్తు లు చేయకపోయిన తాత్కాలిక పద్దతిలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి రొడ్లను మరమ్మత్తు చేయించారు.వర్షాల జాడలేకపోవడంతో వేసిన వ రి, ఇతర ఆరు తడి పంటలు ఎండు ముఖం పడుతున్నాయని అందోళన చెందుతున్న రైతులకు ఆదివారం కురిసిన వర్షం కొంత మేలు చేసిన ఏకదాటిగా వర్షం కురువడంతో పంటపోలాల గట్లు తెలగిపోయాయి. ఇసిక మేటలు పెట్టాయి. ఆదివారం నుండి సోమవారం వరకు ఏకదాటి గా వర్షం కురువడంతో మండలంలో ప్రదాన వనరు అయిన కప్పలవాగు పొంగి ప్రవహించింది.

సిరికొండ మండల కేంద్రంలోని బొడ్డిమామిడి చెరువు అలుగు పొంగి పారుతుండడం తో దొన్లవాగు పొంగి ప్రవహించిం ది. ఎల్లమ్మ చెరువు అలుగునీరు ఎప్పుడు పారేదిశలో పారకుండా గ్రామం వైపు ప్రవహించిం ది. దీంతో చెరువు నుండి వచ్చిన నీరు పోలీస్టేషన్ పక్క వీది వర్షం నీరు ప్రవహించడం తో అక్కడి ప్రజలు గంటల తరబడి రొడ్డు పై న నిలబడ్డారు. గ్రామస్తులు అప్రమత్తమై ఎల్లమ్మ చెరువువద్ద సిమెంటు బ్మాగలో ఇసు నింపి నీరు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే పరిస్థితి గత అగస్టు నెల లో జరిగిన ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. చెరువునీరు సబ్‌స్టేషన్ నుండి ప్రవహించడంలో గ్రామానికి విద్యత్ సరఫరా నిలిపివేశారు. సిరికొండ మండలం నుండి భీమ్‌గల్ వెళ్లే దారి లో దొన్లవాగు, నాయణపల్లె వద్ద లోలెవల్ కాజ్‌వే, కొండూర్ వద్ద పీతుల్ల ఒర్రె పొంగి ప్రవహింయాడంతో రాకపోకలు నిలిచిపోయాయి.సిరికొండ నుండి నిజామాబాదు వెళ్లే దారిపై వహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మొత్తంమీద కొంత మేర వర్షం కురిస్తే బాగుండుడని అనుకుంటున్న రైతులకు అతి భారి వర్షం కురువడం ఆందోళ చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News