Friday, December 20, 2024

లింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : కామ్రేడ్ లింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాం బశివరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉయ్యలవాడ గ్రామ సమీపంలోని మాడ్రన్ కాలేజ్ గేట్ దగ్గర కీ.శే కామ్రేడ్ లింగారెడ్డి స్మారక స్థూపాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు లింగారెడ్డి కుటుంబ సభ్యులతో క లిసి ఆవిష్కరించారు. అనంతరం మొదటి వర్ధంతి సందర్భంగా మాడ్రన్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్మారక సంతాప సభలో ఆ యన మాట్లాడారు.

లింగారెడ్డి ఉమ్మడి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా పార్టీ బలోపేతానికి అనేక సంవత్సరాలు అహర్నిశలు సహా య సహకారాలు అందించారన్నారు. రాబోయే రోజుల్లో ఆయ న ఆశయాలను నెరవేరుస్తామని, ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్ ప్రభుత్వాలను గద్దె దించడమే సిపిఐ ప్రధాన ఎజెండా అని అన్నారు. సిపిఐ పార్టీతో కలిసి వచ్చే వారిని స్వాగతిస్తామని, కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తే సిపిఐ పార్టీ తరపున పూర్తి మద్ధతు ప్రకటిస్తామని అన్నారు.

గతంలో బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ నిరంతరం ప్రజల సంక్షేమానికి ముం దుండి పోరాటాలు చేసే పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తే వా రికి మా మద్ధతు ఉంటు ందని, లేని పక్షంలో సిపిఐ, సిపిఎం, వామపక్షాలు ఇతర పార్టీలను కలుపుకుని ఎలక్షన్ బరిలోకి దిగుతామని సాంబశివరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో లింగారెడ్డి సతీమణి బాలేశ్వరమ్మ, కుమారులు అజయ్, విజ య్ కుమార్ రెడ్డి, కుమార్తె రజిత, అల్లుడు సంజయ్ రెడ్డి, జి ల్లా, రాష్ట్ర పార్టీ సభ్యులు బార్ల వెంకటయ్య, కేశవులు గౌడ్, జి ల్లా కార్యదర్శి ఎం. బాల నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యదర్శి క ందాల రామకృష్ణ, ఈర్ల చంద్రమౌళి, టి. నరసింహ, బిజినేపల్లి మండల పార్టీ కార్యదర్శి కృష్ణాజి, తెలకపల్లి మండల కార్యదర్శి రవీందర్, ప్రజా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి విజ య్, సిపిఐ కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News