Monday, November 18, 2024

ఎమ్మెల్యే పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పదేళ్ల ప్రజా ప్రస్థాన యాత్రలో గ్రామ గ్రామాన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి మద్ధతుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి మా ట్లాడుతూ వర్షాల కారణంగా గురువారం నుంచి తాడూరు మండలం గట్టుపల్లి గ్రామం నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పాదయాత్ర మొదలవుతుందని అన్నారు.

గతంలో తెలకపల్లి మండలంలో చేసిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పం దన వచ్చిందని, 2014, 2018 సంవత్సరంలో బి ఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా ప్రజలు మద్ధతు ఇచ్చారో అదే తరహాలో 2023లో జరిగే ఎన్నికల కు కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మద్ధతు బలంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ సంక్షేమ పథకాలు, ఎంజెఆర్ చారిటబుల్ ట్ర స్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని ముచ్చటగా మూడోసారి ప్రజ లు గెలిపించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం కూలిపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారని, అందులో ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని లాగడం సరికాదని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి గత 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన స్వ లాభం కోసం ఆరుసార్లు పార్టీ మారారని, పార్టీలు మారడం ఆయనకు కొత్త కాదని వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవ చేశారు. కూచకుళ్ల దామోదర్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో తిరగాలని డిమాండ్ చేశారు. నా గం జనార్ధన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అనుభవించి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, అలాంటి నాయకుడు నేనే ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచేది అని అంటూ ప్రెస్ మీట్‌లో చెప్పడం హాస్యాస్పదమ ని అన్నారు.

గెలవడం దేవునికి ఎ రుక ముందు కాంగ్రెస్ పార్టీ టికె ట్ వస్తుందో లేదో గ్యారంటీ లేని నాగం నేడు ప్రెస్‌మీట్‌లో నేను ఎమ్మెల్యేనని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. నాగర్‌కర్నూల్ నియెజకవర్గ ప్రజలు నాగం జనార్ధన్ రెడ్డి అవుట్ డేటెడ్ అని, దామోదర్ రెడ్డి డిలీట్ కాండిడేట్లుగా ప్రజలు ఏనాడో తీర్పునిచ్చారని అన్నారు. ప్రతి గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీకి 80 నుంచి 90శాతం ప్రజల మద్ధతు ఉందని అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు అది చూ సి ఓర్వలేక ఏమి చేయాలో తోచక ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు మద్యం తాపి అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం హీనమైన చర్య అని, అలాంటి సమయం లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కోపంతో ప్రజల మాటనే తన మాటగా చెప్పారని, ఆ మాటలు పట్టుకుని కాంగ్రెస్ నాయకులు పేపర్‌లో ఫోటోలు రావడానికి, పబ్లిసిటీ పెంచుకోవడానికి ప్రెస్‌మీట్‌లు పె ట్టి చెప్పడం ఎంతవరకు న్యాయమని అన్నారు.

మీ రు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్, బిజెపి పార్టీల ను ప్రజలు నమ్మరని, ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీవైపే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోని రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని, లె నియెడల భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కురుమయ్య, జెడ్పిటిసి శ్రీశైలం, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు రైతు బంధు మండల అధ్యక్షులు మాధ వ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News