మన తెలంగాణ/సిటీబ్యూరో: నాలాలో పడి మ హిళ గల్లంతైన సంఘటన గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్యనగర్‌కు చెందిన లక్ష్మి (55) నాలాపై ఇల్లు నిర్మించుకుంది. నాలా పక్క న నిర్మించుకున్న ఇంటికి హుస్సేన్‌సాగర్ నాలా వైపు గోడను నిర్మించుకుంది. ఇది వర్షాలకు రెం డేళ్ల క్రితం కూలిపోయింది. దానిని తిరిగి నిర్మించుకునేందుకు జిహెచ్‌ఎంసి అధికారులను సంప్రదించగా తాము దానిని నిర్మిస్తామని చెప్పడంతో అలాగే వదిలేసింది.
గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో హుస్సేన్‌సాగర్ నాలా పొంగిపొర్లుతోంది. సోమవారం ఉదయం మహిళ ఇంటి వెనుకకు వెళ్లింది. అక్కడి నుంచి మహిళ కన్పించకుండా పోయింది. నాలా వైపు మహిళ గాజులు పగిలి ఉండడంతో త మ తల్లి నాలాలో పడి కొట్టుకుపోయి ఉండవచ్చ ని కూతురు అనుమానిస్తున్నారు. విషయం తెలు సుకున్న జిహెచ్‌ఎంసి, డిఆర్‌ఎఫ్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నాలుగు బృందాలను ఏర్పా టు చేసి మహిళ కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. మహిళ నాలాలో పడిందా లేక ఎక్కడికైనా చెప్పకుండా వెళ్లిందా అనే విషయం తెలియాల్సి ఉంది.