- Advertisement -
షాబాద్ : గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువు, మండల పరిధిలోని నాగర్‌గూడ ఈసీ వాగు, చర్లగూడ వాగు, బొబ్బిలిగామ వాగు, సండ్రోయి వాగులు వర్షాల ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అదే విధంగా చర్లగూడ, బొబ్బిలిగామ, ఏట్ల ఎర్రవల్లి గ్రామాల సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈసీ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే విధంగా మండలంలోని పలు గ్రామాలల్లో పంటలు పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -