Friday, November 22, 2024

జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

12 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల
అధికారులను అప్రమత్తం చేసిన ఎండి దానకిశోర్

మన తెలంగాణ / హైదరాబాద్ : రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రెండు రిజర్వాయర్ల నీటి మట్టాలు పెరిగి నిండుకుండల్లా తలపిస్తున్నాయి. మంగళవారం ఉదయం భారీగా వర్షం కురవడంతో ఉదయం 8 గంటలకు ఇరు జలాశయాల రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తరువాత మధ్యాహ్నం వరకు వరద ఉద్ధృతి పెరగడంతో దీనికి అనుగుణంగా ఎత్తే గేట్ల సంఖ్యను పెంచారు. హిమాయత్ సాగర్ కు 4000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా మరో 4 గేట్ల ద్వారా 4120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్‌కు 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా మరో 4 గేట్ల ద్వారా 1380 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.

మొత్తంగా రెండు జలాశయాలకు 5600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 5500 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ను 12 గేట్ల ద్వారా మూసీ నదిలోనికి వదులుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. ఇతర సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
వివరాలు:
హిమాయత్ సాగర్                       ఉస్మాన్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం:                 1763.50 అడుగులు                     1790.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం:                       1763.50 అడుగులు                     1789.40 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం:             2.968 టీఎంసీలు                         3.900 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం:                         2.968 టీఎంసీలు                         3.762 టీఎంసీలు
ఇన్ ఫ్లో:                                   4000 క్యూసెక్కులు                       2000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో:                                4120 క్యూసెక్కులు                         852 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య:                            17                                        15
ఎత్తిన గేట్ల సంఖ్య:                             06 గేట్లు                                   06 గేట్లు (రెండు అడుగుల మేర)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News