- Advertisement -
హైదరాబాద్: రెండు నెలల నుంచి జీతాలు రావడంలేదని మనస్థాపం చెందిన ఓ హోంగార్డు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గోశామహల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హోంగార్డు రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే రవీందర్‌కు గత రెండు నెలల నుంచి జీతాలు రావడంలేన్నట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మనస్థాపం చెందిన రవీందర్ గోషామహల్‌లోని హోంగార్డుల హెడ్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న వారు మంటలను ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌కు 55శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
- Advertisement -