Friday, October 18, 2024

మోడీ చరిత్రను వక్రీకరిస్తున్నారు: కాంగ్రెస్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ మన దేశం పేరును ‘భారత్’అని పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీతో పాటుగా వివిధ పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 9న జి20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తాన్నారని, ఈ విందుకు హాజరు కావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వానపత్రాల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని కాంగ్రెస్ మండి పడింది. సాధారణంగా ‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారని, ఈ ఆహ్వానపత్రికల్లో మాత్రం ‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో ‘ అయితే ఈ వార్త నిజమే.సెప్టెంబర్ 9న జరిగే జి20 విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వానాలు పంపింది. దీనిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’అని పేర్కొనడానికి బదులు‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ రాశారు.

ఇప్పుడు భారత రాజ్యాంగం అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది. ‘భారత్ అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్’. కానీ ఇప్పుడు ‘ఈ రాష్ట్రాల యూనియన్’ ఇప్పుడు దాడికి గురవుతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చరిత్రను వక్రీకరిస్తూ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని జైరాం రమేశ్ విమర్శించారు. ఇది భారత దేశం. రాష్ట్రాల రాష్ట్రాల యూనియన్.. ఇండియా పార్టీల లక్షం కూడా ఇదే.సామరస్యం, స్నేహం,సయోధ్య, నమ్మకాన్ని తీసుకు రావడమే . జుడేగా భారత్, జీతేగా ఇండియా’అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు కెసి వేణు గోపాల్, ప్రమోద్ తివారీ, ఎంపి శశి థరూర్, ప్రమోద్ తివారీలు కూడా ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న బిజెపి యోచనపై మండిపడ్డారు. ఇండియా అన్న నేరును ద్వేషించడం మొదలు పెట్టారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది ఇండియా అనే విషయం, వాళ్లు రాజ్యాంగం ప్రకారం పని చేయాలనే విషయం దేశప్రజలకు తెలుసునని ప్రమోద్ తివారీ అన్నారు.

దేశ ప్రజలను ఎలా విడదీయాలని మాత్రమే బిజెపి విచ్ఛిన్నకర శక్తులు ఆలోచిస్తాయని వేణుగోపాల్ ట్విట్టర్‌లో అంటూ మోడీజీ మీరు ఏ ప్రయత్నమైనా చేయండి, జుడేగా భారత్, జీతేగా ఇండియా అని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇండియాను భారత్‌గా పిలవడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చు కానీ,లెక్కించడానికి అలవి కాని బ్రాండ్ విలువ కలిగిన ఇండియా పేరును పూర్తిగా తుడిచి వేయడానికి ప్రభుత్వం అంత తెలివి తక్కువగా వ్యవహరిస్తుందని తాను అనుకోవడం లేదని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు: పవార్
దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ అన్నారు.మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న పవార్‌ను రాజ్యాంగంలో భారత దేశం పేరు మార్చబడుతుందా? అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ‘ దీనిపై నాకు ఎలాంటి సమాచారం లేదు’ అని సమాధానమిచ్చారు. ‘ దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకంత కలవరపడుతోందో నాకు అర్థం కావడం లేదు.దేశం పేరు మమార్చే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ పేరు మార్చలేరు’ అని ఆయన అన్నారు. ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల నేతల సమావేశం బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగబోతోందని, ఈ సమావేశంలో దేశంపేరు మార్పు అంశంపై చర్చ ఉంటుందని పవార్ చెప్పారు. ఆప్ ఎంపి రాఘవ్ చద్దా సైతం దేశం పేరును మార్చాలన్న బిజెపి ఆలోచనను తీవ్రంగా తప్పుబట్టారు.
అప్పుడు నోట్ బందీ.. ఇప్పుడు నామ్ బందీ: సిసిఐ(ఎంఎల్)
మరో వైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘నోట్ బందీ’ తర్వాత ‘నామ్ బందీ’ దిశగా సాగుతోందని సిపిఐ( ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మండిపడ్డారు. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోడీ అంటున్నారని, కానీ ఆయన పాలన మాత్రం నియంతృత్వానికి లేబరేటరీగా మారుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాల కూటమి రోజురోజుకు బలం పుంజుకుంటూ ఉండడంతో అధికార బిజెపి భయపడి పోతోందని అందుకనే ఇప్పుడు ఇండియా పేరును భారత్‌గా మార్చాలని అనుకుంటోందని పాటాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భట్టాచార్య అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News