Monday, November 25, 2024

ముంబైలో జికావైరస్ రెండో కేసు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముంబైలో జికావైరస్ రెండో కేసు నమోదైందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం వెల్లడించింది. మొదటి కేసు ఆగస్టు 23న బయటపడింది. ఇప్పుడు ఈ రెండో కేసు తూర్పు ముంబై లోని సబర్బన్ కుర్లాలో 15 ఏళ్ల బాలికకు కనిపించింది. ఆగస్టు 20 నుంచి ఈ బాలిక జ్వరం, తలనొప్పి, వంటి ఇతర రుగ్మతలతో బాధపడుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కార్పొరేషన్ అధికారులు చెప్పారు. జికా వైరస్‌కు వ్యాక్సిన్ కానీ ఔషధాలు కానీ లేవు. జ్వరం, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు , కళ్లు ఎర్రబడడం, కండరాల నొప్పి వంటివి ఈ వైరస్ లక్షణాలు. ఇది స్వయం పరిమిత వ్యాధి అని, ప్రజలు ఆందోళన పడవద్దని కార్పొరేషన్ అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News