- Advertisement -
జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ వేదికగా జరిగే వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని వెల్లడించాడు. డికాక్ 2021లో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. తాజాగా వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా డికాక్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు 140 వన్డేలు ఆడిన డికాక్ 44.85 సగటుతో 5,966 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, మరో 29 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
- Advertisement -