Monday, December 23, 2024

నీ పేరుతో 5 పాస్ పోర్టులు: మహిళకు రూ. 32 లక్షల టోకరా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఓ 50 ఏళ్ల బెంగళూరు మహిళ రూ. 32 లక్షలకు పైగా మోసపోయారు. నీ పేరిట ఐదు పాస్‌పోర్టులు ఉన్నాయని, నీపైన చర్యలు తీసుకుంటామని బెదిరించిన మోసగాళ్లు ఆమె నుంచి రూ. 32.25 లక్షలు వసూలు చేశారు.

ఆగస్టు 2న బెంగళూరుకు చెందిన ఒక మహిళకు ఫ్రెడ్‌ఎక్స్ కొరియర్ కంపెనీప్రతినిధినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆమె పేరిట వచ్చిన పార్సిల్‌లో చాలా కీలకమైన వ్యక్తిగత సమాచారం ఉందని, అందులో మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఐదు పాస్‌పోర్టులు, ఐదుక్రెడిట్ కార్డులు, ఒక లాప్‌టాప్ ఉన్నాయని ఆ వ్యక్తి ఆమెకు తెలిపాడు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తెలియచేసినట్లు కూడా అతను తెలిపాడు.

ఇది జరిగిన కొద్ది సేపటికే ఆమెకు మరో ఫోన్ కాల్ వచ్చింది. స్కైప్‌లో జాయిన్ కావాలంటూ ఆమెను ఆ కాలర్ బెదిరించాడు. ముంబై క్రామై బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారినంటూ పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి ఆ వీడియో కాల్‌లో ఆమెను ఐదు పాస్‌పోర్టుల గురించి ప్రశ్నించాడు. ఆమె పేరిట ఉన్న పత్రాలను కొందరు వ్యక్తులు దుర్వినయోగం చేశారని అతను చెప్పాడు. ఈ కేసును సెటిల్ చేయడానికి కొంత డబ్బు బదిలీ చేయాలని అతను ఆమెకు చెప్పాడు.

అతను చెప్పిన దాని ప్రకారమే ఆమె వివిధ లావాదేవీల ద్వారా రూ. 32.25 లక్షలను కొన్ని ఖాతాలకు బదిలీ చేశారు. అయితే తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె బెంగళూరు ఈశాన్య డివిజన్ సిఇఎన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇటువంటిదే మరో సంఘటన బెంగళూరులోనే జరిగింది. ఒక 36 ఏళ్ల వ్యక్తిని బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ. 8 లక్షలు దోచుకున్నారు. నీ పేరిట 3 పాస్‌పోర్టులు, 160 గ్రాముల ఎండిఎంఎ(మాదకద్రవ్యం)తో కూడిన పార్సిల్ ఉందని, డ్రగ్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో నినున్న అరెస్టు చేయవలసి వస్తుందని ఆ వ్యక్తిని ఫోన్‌లో బెదిరించిన మాయగాళ్లు ఈ కేసును మాఫీ చేయడానికి రూ. 8 లక్షలు చెల్లించాలని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి రూ. 8 లక్షలు చెల్లించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News