కరాచీ: గురువు దేవుడితో సమానం. ఏకంగా పాఠశాలలో తన వద్ద పనిచేస్తున్న 45 మందికి పైగా టీచర్లపై అత్యాచారం చేశాడు. ఆపై వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇర్ఫాన్ గఫూర్ మెమన్ అనే వ్యక్తి కరాచీలోని గుల్షన్-ఎ-హదీద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగాలు, ఇతర విషయాలపై మహిళా టీచర్లను బెదిరించి కార్యాలయంలోనే అత్యాచారం చేశాడు. పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో జరిగిన తతంగం మొత్తాన్ని రికార్డు చేశాడు.
ఆ తర్వాత ఇంటర్నెట్‌లో రేప్ వీడియో ప్రత్యక్షం కావడంతో అతడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం సింధీ విద్యాశాఖ మంత్రి రానా హుస్సేన్ దృష్టికి వెళ్లడంతో పోలీసులు విచారణకు ఆదేశించారు. అధికారులు విచారణ చేయగా పాఠశాలకు అనుమతులు లేవని తేలింది. నిందితుడు ఇర్ఫాన్ ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, “నేను చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను. కానీ, ఈ వీడియోల్లో పాఠశాల సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు’ అని ఆయన అన్నారు. ఈ కేసులో బాధితులంతా పాఠశాలకు చెందిన మహిళలుగా గుర్తించామని ఆ ప్రాంత పోలీసు అధికారి మాలిర్ హుస్సేన్ సర్దార్ తెలిపారు. నిందితుడు ఇర్ఫాన్ ఫోన్ నుంచి దాదాపు 25 చిన్న వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)తో పాటు మెమన్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మెమన్‌తో పాటు ఓ మహిళా టీచర్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వెంటనే, ప్రిన్సిపాల్ కార్యాలయం సీలు చేయబడింది. అతను ఏడు రోజుల భౌతిక రిమాండ్‌కు పంపబడ్డాడు. పాఠశాలలో సుమారు 10 మంది మహిళా ఉపాధ్యాయులు, ఐదుగురు పురుష ఉపాధ్యాయులు 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళా టీచర్లను లైంగికంగా వేధించేవాడని విచారణ అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ల నేపథ్యంలో మెమన్‌పై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైంది.