Thursday, December 19, 2024

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(07/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం:మిత్రులతో ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదాలు పరిష్కరించుకుంటారు.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.రుణ బాధలు తప్పవు. సోదరుల నుండి ధన లాభాలు పొందుతారు.అనుకోని సంఘటనలు మీకు మానసిక ఆనందం కలిగిస్తాయి.

వృషభం:సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ధన లాభాలు ఉంటాయి. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటారు.

మిథునం:ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధనం అందుతుంది.విషయ వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు.నూతన వస్తువులు,వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులలో లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది.

సింహం:ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల నుండి ఆర్థిక పరమైన కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు స్వీకరిస్తారు.

కన్య:అనుకోకుండా అవకాశాలు మీఇంటి తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది.వ్యవహారాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వాటిని సకాలంలో పూర్తిచేసి మన్ననలు పొందుతారు.

తుల:ఆర్థిక ఇబ్బందులు ఎదురైన చికాకులు పెట్టిన వాటిని అధిగమించి ముందుకు సాగుతారు.రుణ బాధలు తప్పక పోవచ్చు.ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృశ్చికం:చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. భూ,షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు అర్జిస్తారు. సంఘంలో మీమాటకు విలువ పెరుగుతుంది.నూతన ఒప్పందాలు,కాంట్రాక్టులు దక్కుతాయి అనాలోచితని ర్ణయాలకు దూరంగా ఉండండి.

ధనస్సు:వృత్తి-వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. వస్తు, వస్త్రాలు, భూములు కొనుగోలుచేస్తారు. గృహ నిర్మాణం ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి.

మకరం:ఆస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. మీరు తలపెట్టిన పనులు నిదానంగా సక్రమంగా పూర్తిచేస్తారు.సన్నిహితులతో ఆనందంగా ఉంటారు.

కుంభం:అనవసర వివాదాస్పద వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. శ్రమ ఫలిస్తుంది.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాల మేరకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మీనం:సోదరుల నుండి ఆస్తి లాభాలు పొందుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.వాహన సౌఖ్యం గోచరిస్తున్నది.ఉద్యోగస్తులకు సానుకూల సమయమని చెప్పవచ్చును.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News