Monday, December 23, 2024

ప్రధాని భద్రతా బృందం ఎస్పీజీ చీఫ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. 61 ఏళ్ల సిన్హా గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు సీనియర్ అధికారులు వెల్లడించారు. కేరళ కేడర్ నుంచి 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిన్మా 2016 లో ఎస్పీజీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలనే ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించారు. గతంలో ఆయన కేరళ పోలీస్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తిరువనంతపురంలో డీసీపీ కమిషనర్, రేంజ్ ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, అడ్మినిస్ట్రేషన్ ఐజీగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News