- Advertisement -
హైదరాబాద్: నగరంలో కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సైడ్ వాల్ కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని సైడ్ వాల్ సంట్రింగ్ కర్రలు కూలడంతో ఇద్దరు కూలీలు ఆరో అంతస్తు పై నుంచి కింద పడి మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని ఒడిసాకు చెందిన సంతోష్, సోనియాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -