- Advertisement -
హైదరాబాద్: మరో ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ మీద కేంద్రీకృతం అయిన ఉపరితల ఆవర్తనంతోపాటు షీర్ జోన్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కారణంగా వర్షాల ఉధృతి కొనసాగుతుందని అంచనా వేసింది.
దీంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, బూపాలపల్లి, కామారెడ్డి వంటి పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని తెలిపింది. ఈరోజు(గురువారం) రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానాలు పడుతాయని సూచించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాక పేర్కొంది.
- Advertisement -