Saturday, November 23, 2024

కొత్తగా అందుబాటులోకి 900 మెడికల్ సీట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3,915 సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News