Monday, December 23, 2024

మంచం మించి పడ్డ మహాకాయం..

- Advertisement -
- Advertisement -

థానే : అసలే అనారోగ్యం…పైగా 160 కిలోల బరువున్న స్థూలకాయం, ఆపైన ఉన్నట్లుండి పడక పై నుంచి కింద పడింది. ఈ కొండంత మనిషిని తిరిగి బెడ్‌పైకి చేర్చడం కుటుంబ సభ్యులకు జటిల సమస్య అయింది. దీనితో వారు తాము నివాసముంటున్న థానేలోని అగ్నిమాపక దళం వారి సాయం కోరారు. ఆమెను బెడ్‌పైకి చేర్చడానికి సాయం కావాలని అభ్యర్థించారని స్థానిక పురపాలక అధికారి ఒక్కరు గురువారం తెలిపారు. 62 సంవత్సరాల ఈ మహిళ కొంత కాలంగా నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయింది. వాఘ్‌బిల్ ప్రాంతంలోని తమ ఫ్లాట్‌లో ఉండే ఆమె బెడ్‌పై నుంచి పడింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఏమి చేయాలో తోచక ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేసి చెప్పారని, ఈ విషయంలో తామేమీ చేయలేమని భావించిన వీరు దీనిని థానే మున్పిసల్ కార్పొరేషన్ అధికారులకు తెలియచేశారని వెల్లడైంది. దీనితో అక్కడి ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం (ఆర్‌డిఎంసి) బృందం అక్కడికి వెళ్లి ఈ మహిళను ఎత్తి మంచంపై యధాస్థానంలో ఉంచింది. తమకు సాయం కోసం అప్పుడప్పుడు చాలా ఫోన్లు వస్తుంటాయని, వీటిపై తాము తక్షణం అత్యవసరంగా స్పందిస్తామని, అయితే ఇటువంటి విపత్తు సమాచారం అందడం తమకు తొలిసారి అని ఈ విభాగం చీఫ్ యాసిన్ తాడ్వి ఆ తరువాత విలేకరులకు తెలిపారు. ఇది తమకు సరికొత్త అనుభవం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News