Monday, December 23, 2024

ఎక్స్‌రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్‌తో రాకెట్‌ను ప్రయోగించిన జపాన్

- Advertisement -
- Advertisement -

టోక్యో: నైరుతి జపాన్ లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం ఎక్స్‌రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్‌ను తీసుకొని హెచ్2 ఎ రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది. విశ్వం పుట్టుక రహస్యాలను, గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనడానికి ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు జపాన్ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తరువాత ఎక్స్‌రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపి మిషన్ ఉపగ్రహాన్ని హెచ్2 ఎ రాకెట్ భూకక్ష లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టినట్టు జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది.

ఈ ప్రయోగం వల్ల అత్యంత వేడిగా ఉండే ప్లాస్మా లక్షణాలు తెలుస్తాయని రైస్ స్పేస్ ఇనిస్టిట్యూట్ (రైస్ యూనివర్శిటీ) డైరెక్టర్ డేవిడ్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. వైద్యపరంగా గాయాలు మాన్పడానికి, కంప్యూటర్ చిప్స్ తయారీకి, పర్యావరణాన్ని పరిశుభ్రం చేయడానికి ఈ విధంగా అనేక రకాలుగా ప్లాస్మా ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్మాను తెలుసుకోవడం వల్ల కృష్ణబిలాల వైవిధ్యం, గెలాక్సీల పుట్టుక తెలుస్తుందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News