మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు సోదాలు నిర్వహించారు. నిషే ధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియాకు చెందిన యూనస్‌ను మూడు నెలల కిందట ఎన్‌ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూనస్ అత్తమ్మ గ్రామమైన ఆళ్లగడ్డలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ ఎస్‌పి రాజీవ్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు.
యూఎస్ బంధువుల ఇళ్లలో కూడా ఎన్‌ఐఎ సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో కూడా ఎన్‌ఐఎ అధికారులు ఆళ్లగడ్డలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక, యూనస్ కర్ణాటక పిఎఫ్‌ఐలో కీలకంగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్‌ఐఎ అధికారులు గుర్తించారు. గతంలో నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు జరిపాడు. 2022లో ఎన్‌ఐఎ సోదాలు సమయంలో కర్ణాటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ పిఎఫ్‌ఐ సభ్యులకు శిక్షణ కార్యకలాపాలను కొనసాగించాడు.