- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహా గోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదనే వాదన ఉంది. తిరుమలను ‘నో ఫ్లైయింగ్ జోన్’ పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తిరుమల కొండ గగనతలంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమని టిటిడి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే టిటిడి అభ్యంతరాలను విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
- Advertisement -