Monday, November 18, 2024

ముషీరాబాద్‌లో డెంగ్యూ కలకలం..

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ముషీరాబాద్ యూపిహెచ్‌సి సమీపంలో నివసించే ఓ బాలింతకు డెంగ్యూ సోకింది. ఇటీవల తన 12 ఏళ్ల కుమారుడు, భర్తకు సైతం ఆ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడంతో వ్యాధి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తాను బాలింత కావడం వల్ల, సాధారణంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో డెంగ్యూ సోకి ప్లేట్‌లేట్ కౌంట్ పూర్తిగా తగ్గిపోయినట్టుగా బాధితురాలు గురువారం ఎంఎల్ఎ ముఠా గోపాల్ కు మొర పెట్టుకున్నారు. తనకు మెరుగైన వైద్యం సదుపాయం కల్పించాలని ఆమె కోరింది. ఈ విషయంపై తక్షణమే స్పందించిన ఎంఎల్ఎ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని సూచించి, అక్కడే ఓ మహిళా నాయకురాలను గాంధీకి తీసుకెళ్లి వైద్యులు పరీక్ష చేసే వరకూ వెంట ఉండాలని ఆదేశించారు.

దీంతో బిఆర్‌ఎస్ నాయకురాలు సంధ్యారాణి బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ యూపిహెచ్‌సి అధికారులు గాంధీ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి వివరాలను సేకరించారు. వైద్య పరమైన ఎలాంటి అత్యవసర పరిస్థితు ల్లో అయినా సరే.. తమను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు కారణంగా అనేక మంది సాధారణ ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో అత్యధికంగా బాధపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ డెంగ్యూ సోకినట్టుగా బాధితురాలు చెప్పడంతో పలువురు భయబ్రాంతులకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News