Monday, November 25, 2024

ఈ నెల 12న 100 ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళల ఆరోగ్య సంరక్షణ కో సం సిఎం కెసిఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలను ఈనెల 12వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, కొత్తవాటితో ఆ సంఖ్య 372కు పెరగనుందని పేర్కొన్నారు.

ఆరోగ్య మహిళ ద్వారా ఇప్పటి వరకు 2,78,317 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, అవసరం ఉన్న 13,673 వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లినట్లు చెప్పారు. 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ఏఎన్‌ఎంల పిఆర్‌సి, ఏరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంజూరు చేసిన డిఎంహెచ్‌ల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News