- Advertisement -
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. మిర్యాలగూడలో పై వంతెన వద్ద టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ బస్సును నిలిపి వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: సెమీస్‌లో అల్కరాజ్, కీస్
- Advertisement -