- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కి ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -