- Advertisement -
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ పాపులర్ కారు నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. కొత్త సబ్-4 మీటర్ల ఎలక్ట్రిక్ ఎస్‌యువి పూర్తి ఛార్జింగ్‌తో 465కిమీల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ కారు బాహ్య, ఇంటీరియర్ డిజైన్‌ను అప్‌డేట్ చేసింది. ఇది మహీంద్రా ఎక్స్‌యువి400తో పోటీపడనుంది. టాటా నెక్సాన్ ఇవి సెప్టెంబర్ 14న మూడు వేరియంట్లలో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న 8 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుంది. టాటా నెక్సాన్ ఇవి ఫేస్‌లిఫ్ట్ ధర ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం టాటా నెక్సాన్ ఇవి ధరలు రూ. 14.50 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అప్‌డేట్ తర్వాత ధరను పెంచవచ్చు.
Also Read: చైనా ప్రాతినిధ్యంపై టిబెటియన్ల నిరసనలు
- Advertisement -