అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రభుత్వానికి రూ.300 కోట్ల నష్టం జరిగిందని ఎపి సిఐడి అడిషనల్ డిజి ఎన్ సంజయ్ తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ప్రైవేటు కంపెనీలు ఒక్క రూపాయి కూడా చెల్లించడంలేదని, ఎపి ప్రభుత్వం 371 కోట్లు అడ్వాన్సుల రూపంలో చెల్లించిందని సిఐడి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా దారి మళ్లించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నిధుల్లో భారీ మొత్తం నిధులు షెల్ కంపెనీలకు తరలించినట్టు గుర్తించామని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు, టిడిపి ప్రధాన సూత్రదారులన్నారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరిగా మారిందని, ఈ కేసులో అంతిమ లబ్దిదారు కూడా చంద్రబాబే అని స్పష్టం చేశారు.
లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతామని, ఇడి, జిఎస్‌టిలు కూడా ఈ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్నాయని, నిధుల మళ్లింపుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
Also Read: పెంపుడు మేకకూ రైలు టిక్కెట్..ఆ గామీణ మహిళ నిజాయితీకి వందనం(వైరల్ వీడియో)