విజయవాడ: కొద్దిసేపటి క్రితం ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను నారా చంద్రబాబు భార్య భువనేశ్వరి దర్శించుకున్నారు. తన బాధలు చెప్పుకోవడానికే దుర్గమ్మ దగ్గరకు వచ్చానని ఆమె తెలిపారు. ఏపీ ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. తమ పోరాటానికి అందరూ మద్దతివ్వాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ వెనుక హైడ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. బాబు భరోసా-భవిష్యత్తుకు హామీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాలులో బస చేశారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత 600 మందికి పైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. అడుగడుగునా చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్‌ను చుట్టుముట్టారు. అనంతరం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
నారా భువనేశ్వరి గారు, నందమూరి కుటుంబ సభ్యులు కనక దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ప్రజలను కోరింది ఒక్కటే. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడుతున్న @ncbn గారికి ప్రజలంతా అండగా నిలవాలని.#WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023#StopIllegalArrestOfCBN#PsychoJagan… pic.twitter.com/3nOMY3H2q9
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023