Friday, December 20, 2024

హుస్సేన్ సాగర్ వరదనీటి కాల్వపై రిటైనింగ్ వాల్ నిర్మాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  హుస్సేన్ సాగర్ వరద నీటి కాల్వలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదన లు సిద్దం చేయాలని కమిషనర్ రోనాల్ రోస్ అధికారులను ఆదేశించారు.ఇటీవల హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా లో పడి మహిళ మరణించిన నేపథ్యంంలో ఘటన స్థలాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్ సర్ప ప్లస్ నాలా కు ఇరువైపులా ఉన్న మారుతి నగర్, దామోదర్ సంజీవయ్య నగర్ తో పాటు గాంధీ నగర్ అశోక్ నగర్ కాలనీ వరకు కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రెండు వైపులా రిటర్నింగ్ వాల్ నిర్మించాలని గతం లో ఉన్న రిటైనింగ్ వాల్ పైనే ఎత్తుగా చేపట్టాలని కోరగా, కమిషనర్ స్పందిస్తూ వెంటనే ప్రతిపాదన సిద్దం చేయాలని లేక్స్ అధికారులను ఆదేశించారు నాలా రిటర్నింగ్ వాల్ పైన నిర్మాణాలు చేసినవి నాలా అనుకొని ఉన్న నిర్మించిన ఇళ్లును శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని అంతేకాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన బఫర్ స్థలం నిర్దేశించిన మేరకు ఎంత ఉండాలో లేక్స్ అధికారులను టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే పూర్తి నివేదిక అందజేయాలని కమిషనర్ ఆదేశించారు.

దామోదర్ సంజీవయ్య నగర్ వైపు నాలా కు అనుకొని ఉన్న కొన్ని భవనాలు వరద కు కొట్టుకొని పోయి పునాది లేకుండా ఉన్నాయని వాటి పై కూడా దృష్టి సారించాలని భారీ వర్షాలు కురిసినా సందర్భం లో అట్టి శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలి పోయే ప్రమాదం ఉన్నందున ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాంధీనగర్ సబర్మతి బ్రిడ్జి వద్ద నాలను పరిశీలిస్తుండ గా యస్‌ఎన్ డి పి ద్వారా చేపట్టిన రిటైనింగ్ వాల్ పైన కొందరు ఇంటి యజమానులు ఎక్స్ టెన్షన్ పనుల ను గమనించిన కమిషనర్ వెంటనే తొలగించాలని సర్కిల్ ,జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.కమిషనర్ ఆదేశాల మేరకు ఆయా నిర్మాణాలను వెంటనే తొలగించారు. రిటైనింగ్ వాల్ లోపల నిర్మాణాలు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News