Friday, November 22, 2024

నిబంధనల ప్రకారమే చంద్రబాబు ఆరెస్ట్: హోంమంత్రి వనిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నియమ నిబంధనల ప్రకారమే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని ఏపి హోశాఖ మంత్రి తానేటి వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై వివరాలను హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వనిత మీడియాకు వెల్లడించారు. శనివారం ఉదయం సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవు అని స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని వెల్లడించారు.

భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్ లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ చంద్రబాబు వారి మాట వినలేదన్నారు. ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ అర్థం అవుతుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో జరిగిన స్కామ్ ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ కుట్రలతో అరెస్ట్ చేయించారని, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగిందన్నారు. రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే అని అందరూ గమనించాలని కోరారు.

చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెలసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారని అన్నారు. పురందేశ్వరి అరెస్ట్ లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షాపై రాళ్లు వేయించిన.. మోదీని తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తుందా అని నిలదీశారు. పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా చెప్పాలని ప్రశ్నించారు. ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా అమె సమాధానం చెప్పాలన్నారు. ఇన్నాళ్లు మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈ రోజు ముందుకొచ్చారని అంటే ఈ స్కాంలో పవన్ కళ్యాణ్ కు అందుతున్న ప్యాకేజీ ఎంత అని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News