Monday, December 23, 2024

రష్యా పేరు లేకుండా డిక్లరేషన్ ఎందుకు.. ఇది గుడ్డిలో మెల్ల ప్రక్రియ: ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

కీవ్: జి 20 ఢిల్లీ డిక్లరేషన్‌లో రష్యా పేరు పెట్టకుండా నామమాత్రంగా వ్యవహరించారని ఉక్రెయిన్ స్పందించింది. దెబ్బతీసిన వారి పేరు ప్రస్తావించకుండా గాయానికి మందు కోరడం వల్ల ఉపయోగం లేదని ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో తెలిపారు. రష్యాను దోషిగా ఖరారు చేయాల్సి ఉంది.

లేదా కనీసం రష్యాదే బాధ్యత అని తేల్చాల్సి ఉంది. సమస్యను తెలిపారు. ఇది డొంకతిరుగుడు వ్యవహారం, అయితే అంతర్జాతీయ వేదికపై ఉక్రెయిన్ ప్రస్తావన రావడం మంచిదే అయిందని తెలిపారు. తమ దేశ ప్రతినిధి బృందానికి అవకాశం ఇచ్చి ఉంటే వాస్తవిక పరిస్థితిని అందరికి తెలియచేసే వారిమని ఈ ప్రతినిధి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News