15న పరీక్షకు ఏర్పాట్లు
27న ఫలితాలు ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అ ధికారులు tstet.cgg.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉం చారు. సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ 040 -23120340, 040 -23120433 నెంబర్ల ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో టెట్ పరీక్ష జరగనుంది. ఉ.9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్- 1,మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు పేప ర్- 2 పరీక్షను నిర్వహించనున్నారు. ఫలితాలు సె ప్టెంబరు 27న విడుదల చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రా రంభం కాగా, ఆగస్టు 16 దరఖాస్తు గడువు ముగిసింది. టెకట్‌కు మొత్తం 2,91, 058 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ 1కు 82, 560 మంది, పేపర్ 2కు 21,501 మంది, రెండింటికీ 1,86,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీచ ర్ వృత్తిలో అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పో స్టుల భర్తీకి నిర్వహించే టిఆర్‌టి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవలసి ఉంటుంది.
ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితం చెల్లుబాటు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ -1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధించే ఎస్‌జిటి పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులవుతారు.