Sunday, December 22, 2024

వ్యక్తిగత గ్రూమింగ్, స్టైలింగ్ ఉత్పత్తులలోకి ప్రవేశించిన మార్ఫీ రిచర్డ్స్..

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ ప్రీమియం కిచెన్, గృహోపకరణాల బ్రాండ్, మార్ఫీ రిచర్డ్స్, వ్యక్తిగత గ్రూమింగ్, స్టైలింగ్ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్పత్తుల శ్రేణి స్త్రీ, పురుషులకు అవసరమైన ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది వీటిలో ట్రిమ్మర్లు, బాడీ గ్రూమర్‌లు, డిఫ్యూజర్‌లతో కూడిన హెయిర్ డ్రైయర్‌లు, హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా, మార్ఫీ రిచర్డ్స్, తమ ప్రీమియం శ్రేణి గృహోపకరణాలు, జీవితాన్ని సులభతరం చేయడానికి, సంతోషకరమైనదిగా చేయడానికి ఉద్దేశించిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని వ్యక్తిగత గ్రూమింగ్ విభాగం బ్రాండ్ కోసం అనేక ఉత్తేజకరమైన అవకాశాలను మిళితం చేస్తుంది. ఈ వ్యాపారంలోకి ప్రవేశించడం వలన వారు భారతీయ యువ వినియోగదారుల ను మరింతగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రూ. 699 నుండి ప్రారంభమయ్యే ధరల శ్రేణిలో ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఎక్కువ మంది అభిమాన ఉత్పత్తులుగానూ వెలుగొందుతున్నాయి.

ఈ విభాగం లో ప్రవేశించటం గురించి బజాజ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ.. ” భారతీయ యువ వినియోగదారులలో మనం చూస్తున్న అతిపెద్ద ట్రెండ్‌లలో స్వీయ సంరక్షణ, గ్రూమింగ్ అనేవి ప్రముఖంగా కనిపిస్తున్నాయి. స్త్రీ, పురుషులు ఇరువురూ వీటిని తమ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. మేము మా వినియోగదారులతో మాట్లాడినప్పుడు, గ్రూమింగ్ యొక్క ఫలితం బాహ్య ఆకర్షణ అయితే, ఈ ప్రక్రియ చాలా సన్నిహితంగా, వ్యక్తిగతంగా ఉంటుందని మేము గ్రహించాము. మార్ఫీ రిచర్డ్స్ క్రియాత్మక,యు సౌందర్య ఉత్పత్తులు అందిస్తుంది. ఇవి దైనందిన జీవితానికి ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. మా దృఢమైన ఉత్పత్తులు, ఆలోచనాత్మకమైన సరళత, డిజైన్‌లో వాస్తవికత వంటివి అత్యంత కీలకమైన వైవిధ్య కారకాలు గా నిలుస్తాయి. ఈ ప్రతిష్టాత్మక ఆవిష్కరణతో, మేము గ్రూమింగ్ సెగ్మెంట్‌ను గణనీయంగా పెంచుకోవాలని, ఈ విభాగంలో మా ఈక్విటీని పెంచుకోవాలని భావిస్తున్నాము” అని అన్నారు.

మార్ఫీ రిచర్డ్స్ ఒక వారసత్వం, ఒక ఇంజనీర్ – సేల్స్‌మాన్‌ను, సాంకేతికత-మానవత్వాన్ని, పనితీరు, రూపాన్ని కలుసుకునే కథ. ”హ్యాపీనెస్ ఇంజినీర్డ్” యొక్క లక్ష్యం తో నడుపబడుతున్న మార్ఫీ రిచర్డ్స్, సహజమైన, వినియోగదారు- అనుకూల ఉత్పత్తుల కోసం వినియోగదారు యొక్క అవసరాన్ని ఉత్పత్తి రూపకల్పన, కార్యాచరణ ద్వారా తీరుస్తుంది. 2022లో, భారతదేశం, పొరుగు ప్రాంతాలలో గృహోపకరణాలను ఉత్పత్తి చేయడం, మార్కెటింగ్ చేయడం మరియు విక్రయించడం కొనసాగించడానికి వారు తమ ట్రేడ్‌మార్క్ ఒప్పందాన్ని 15 సంవత్సరాల పాటు పొడిగించారు. దీనిని అనుసరించి, దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులు మా వ్యాపార సామర్థ్యాలను బలోపేతం చేయడం, విస్తరణపై దృష్టి సారించాయి.

అత్యంత ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ అయినందున, మార్ఫీ రిచర్డ్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న OTG బ్రాండ్ గా వెలుగొందుతుంది, వృత్తి నిపుణులు, హోమ్ బేకర్స్ వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. వినియోగదారులకు ఇంట్లో కేఫ్ లాంటి కాఫీని అందించే కాఫీ మేకర్స్ కు బ్రాండ్ విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. మార్ఫీ రిచర్డ్స్ స్థిరంగా పలు ఇతర విభాగాలలో సైతం అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు కలిగి వుంది. వీటిలో డిజిచెఫ్ OTG, కుబే వాటర్ హీటర్ వంటివి వున్నాయి. ఇవి రెండూ కూడా నీల్సెన్ఐక్యూచే ” ప్రోడక్ట్ అఫ్ ది ఇయర్” అవార్డు గెలుచుకున్నాయి. వారు ఇటీవలే స్టీమ్ ప్రో పోర్టబుల్, ట్రావెల్ ఫ్రెండ్లీ గార్మెంట్ స్టీమర్, 5L డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్, DuoPresso 2-in-1 కాఫీ మేకర్, మెలాంజ్ స్టాండ్ మిక్సర్‌ను కూడా విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News