అమరావతి: విజయవాడలోని ఎసిబి కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును ఎసిబి కోర్టు రిజర్వ్ లో ఉంచింది. టిడిపి అధినేత, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదని, స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందని ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నియమాలను తాము పాటించామని, మాజీ సిఎం అనేది గౌరవప్రదమైన హోదా మాత్రమేనని, వాస్తవ హోదా ఎంఎల్‌ఎ మాత్రమేనని తెలియజేశారు. అరెస్ట్‌కు ముందు స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని, అరెస్ట్ చేసిన తరువాత మూడు నెలల్లోపు గవర్నర్‌కు సమాచారం ఇవ్వొచ్చన్నారు.
Also Read: రూ. 360.40 కోట్లకు ముంబై గణేశుడి బీమా
అంతేకాని గవర్నర్ అనుమతి అవసరం లేదని, మామూలు కేసుల్లో వారం రోజులకు ముందు నోటీసు ఇవ్వాలని, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి కేసుల్లో నోటీసుల అవసరం లేకుండా అరెస్టు చేయవచ్చని ఎఎజి వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశించారని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎఎజి పేర్కొన్నారు. పదవిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డాడని, సెక్షన్ 409 చంద్రబాబు వర్తిస్తుందని తెలియజేశారు. బాబు తప్పు చేయలేదని ఆయన తరుఫు లాయర్లు చెప్పడం లేదని, అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారని ఎఎజి దుయ్యబట్టారు.