Monday, December 23, 2024

హోంగార్డు కుటుంబానికి రాచకొండ పోలీసులు ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల నగరంలో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి రాచకొండ పోలీసులు ఆర్థికం సహాయం అందించారు. మల్కాజిగిరి ఏసిపి సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది కలిసి రూ.10 లక్షలను విరాళంగా సమీకరించి కమిషనర్  ఎస్. చౌహాన్ చేతుల మీదుగా చనిపోయిన హోంగార్డు భార్యకు అందజేశారు. మల్కాజిగిరి ఏసిపి కార్యాలయంలో రాము పదకొండేళ్లుగా హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ రాము బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఏసిపి సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్టేషన్ల సిబ్బంది కలిసి విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని రాము భార్యకు కమిషనర్  ద్వారా అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ చౌహాన్ మాట్లాడుతూ రాము ముగ్గురు కూతుళ్ల చదువుకు తోడ్పాటును అందిస్తామని తెలిపారు. హోంగార్డు రాము కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News