Sunday, January 19, 2025

‘లింగి లింగి లింగిడి’

- Advertisement -
- Advertisement -

జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ నాయాట్టుకి రీమేక్‌ను కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీవాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మిశరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఆసక్తికరంగా ట్రైలర్

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. మాస్సి శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్ సోమవారం విడుదలవుతుంది. ఆదివారం ఈ పాటకు సంబంధించి ఫస్ట్ టైమ్ హుక్ స్టెప్ ద్వారా ‘లింగి లింగి లింగిడి’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News