Monday, April 7, 2025

జమిలి ఎన్నికలు అసాధ్యం: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఆచరణలో అసాధ్యమని కర్నాకట ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ప్రకటించారు. ఆ ఆలోచనే అశాస్త్రీయనమని విలేకరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ఉంటుందని, మరి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం కొంతకాలం పాలించి ఉంటుందని, ఒకేసారి అన్నిచోట్ల ఎన్నికలు ఎలా సాధ్యపడతాయని సిద్దరామయ్య ప్రశ్నించారు.

కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన కర్నాటక ఎన్నికల ఫలితాలు బిజెపిలో భయాందోళన పుట్టించాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం సాగించిన ప్రతి చోట కాంగ్రెస్ గెలుపొందిందని, కర్నాటకలోని ఇరుకు వీధులలో కూడా మోడీ ప్రచారం చేశారని, కాంగ్రెస్ 125 అసెంబ్లీ స్థానాలలో గెలుపొందిందని ఆయన చెప్పారు. దీంతో మోడీలో ఆందోళన పెరిగిందని, ఈ కారణంగానే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచన ఆయనలో తలెత్తిందని సిఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News