Monday, December 23, 2024

‘మార్క్ ఆంటోని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశాల్

- Advertisement -
విశాల్  హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం‘మార్క్ ఆంటోని’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ నటుడు ఎస్.జె.సూర్య కీ రీల్ పోషించారు. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో
 నితిన్ మాట్లాడుతూ.. ‘మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ క్రేజీగా ఉన్నాయి. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అధిక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య గారు నటుడిగా, దర్శకుడిగా నాకు చాలా ఇష్టం. అభినయ ఎంతో మందికి స్పూర్తి. ఆమె నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. సునీల్ అన్న ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తుంటారు. విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించే సినిమాలన్నీ హిట్ అవ్వాలని అనుకుంటాను. ఈ మూవీతో ఆయన మరో స్థాయికి వెళ్లాలి. సెప్టెంబర్ 15న రాబోతోన్న మార్క్ ఆంటోని పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
 హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ స్టేట్‌లో నితిన్ తమ్ముడిలాంటి వాడు. రానా, నితిన్‌లతోనే నేను ఎక్కువగా ఉంటాను. నితిన్ నాకు దొరకడం గిఫ్ట్. గెస్టుగా పిలిచా, కానీ నేను టైం ఇవ్వకపోయినా.. నాకోసం వచ్చాడు. నితిన్ సక్సెస్ గ్రాఫ్ చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఈ ఈవెంట్‌కు నితిన్ రావడం హ్యాపీగా ఉంది. ఈ రోజుతో నా మొదటి చిత్రం చల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) రిలీజై 19 ఏళ్లు అవుతోంది.
ఆడియెన్స్ నా సినిమాలకు డబ్బులు పెట్టి, టికెట్ కొని చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలని నేను అనుకోను. ఆ డబ్బులు అందరికీ ఉపయోగపడాలని అనుకుంటాను. నిర్మాత వినోద్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నా కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. మాకు పునాదిలా నిర్మాత నిలబడ్డారు. 9 ఏళ్ల క్రితం ఓ లవ్ స్టోరీని రాసుకున్నాడు. ఇది కథనా? అని నిర్మాత బయటకు వెళ్లమన్నాడు. నలబై మంది బయటకు గెంటేశారు. ఓ సినిమా తీశాడు. ఫ్లాప్ అయింది. ఏడేళ్లుగా మా ప్రయాణం సాగుతోంది.
మా ప్రాజెక్ట్‌ను ప్రకటించిన తరువాత చాలా మంది వద్దు అన్నారు. నేను ఎందుకు చేశాను.. ఆ నమ్మకం ఏంటన్నది సెప్టెంబర్ 15న అందరికీ తెలుస్తుంది.  ఎస్ జే సూర్య గారు 22 గంటలు కంటిన్యూగా డబ్బింగ్ చెబుతూనే ఉన్నారు. ఈ సినిమాతో నాకు సూర్య, సునిల్ రూపంలో మంచి బ్రదర్స్ దొరికారు. టీం అంతా కలిసి కష్టపడటం వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. అభినయ ఎంతో మందికి స్పూర్తి. ఆమెకు సరిహద్దులనేవి లేవు. వేణు గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ సినిమాను తీసుకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లందరికీ థాంక్స్. మార్క్ ఆంటోని అందరికీ నచ్చుతుంది. ఆడియెన్స్ పెట్టే డబ్బులకు న్యాయం జరుగుతుంది. రెండున్నర గంటలు నవ్వుకునేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
 అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘విశాల్ అన్నతో ఎంతో కాలం క్రితం పని చేశాను. కానీ ఇన్నాళ్లకు టైం వచ్చింది. మార్క్ ఆంటోని ఆయన కోసమే రాసిన కథ. విశాల్, ఎస్ జే సూర్య కాంబోలో వచ్చే సీన్లు అద్భుతంగా ఉంటాయి. ఇది తండ్రీ కొడుకుల కథ. విశాల్ అన్న కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. యాక్షన్ హీరో అనేది ఆయన పర్ఫామెన్స్‌ను డామినేట్ చేసింది. కానీ ఇందులో ఆయనలోని పరిపూర్ణమైన నటుడ్ని చూస్తారు. నాలాంటి వాళ్లని నమ్మి ఛాన్స్ ఇవ్వడం అంత సులభం కాదు. పుష్పలో సునిల్ గారి పాత్రను చూసి షాక్ అయ్యాను. ఇందులో పాత్రను చేస్తారా? అని అడిగాను. ఆయన ఫస్ట్ తమిళ్ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. జీవీ సర్ అద్భుతంగా సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. కెమెరామెన్ అభినందన్, నా టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. మేం మా బెస్ట్ ఇచ్చాం. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 సునిల్ మాట్లాడుతూ.. ‘నా లైఫ్‌లోనే తమిళ సినిమా చేస్తాను అని అనుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్. చిన్న పిల్లలకు భాష రాకపోతే, అక్షరాలు తెలియకపోతే ఎలా నేర్పించుకుంటామో అలా అధిక్ నన్ను చూసుకున్నాడు. ఆయన ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటారు. ఎస్ జే సూర్య గారి దర్శకత్వంలో పని చేశాను. ఇప్పుడు ఆయన పక్కన నటించాను. నిర్మాత వినోద్ గారికి ఈ సినిమాతో బాగా డబ్బులు వస్తాయి. ఈ మూవీకి సీక్వెల్స్ తీస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. పందెం కోడిలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా విశాల్ అలానే ఉన్నారు. అభినయ పాన్ వరల్డ్ యాక్టర్. భాష అవసరం లేదు. మాట్లాడే అవసరం లేదు.. చార్లీ చాప్లిన్ కూడ మాట్లాడకుండా ప్రపంచం మొత్తం నవ్వించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘మార్క్ ఆంటోని మంచి చిత్రం. సెప్టెంబర్ 15న అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. తెలుగులో డబ్ చేశాం. హిందీలోనూ ఈ చిత్రం రాబోతోంది. దర్శకుడిగా హైద్రాబాద్‌కు ఎన్నో సార్లు వచ్చాను. నటుడ్ని అవ్వాలనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. నటుడిగా అవకాశాలు ఇవ్వాలంటే నమ్మకం ఉండాలి.. అలా నన్ను ఎవ్వరూ నమ్మలేదు. అందుకే నేను డైరెక్టర్ అయి, నిర్మాతగా మారి నటుడిని అయ్యాను. ఖుషి లాంటి సక్సెస్ మళ్లీ నాకు ఎప్పుడూ రాలేదు. వినాయక చవితికి ఓ మంచి చిత్రాన్ని తీసుకొస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ పవన్ గారు మేం చెప్పాలనుకున్నది అంతా చెప్పేశారు. ఈ కథ వినమని, చేయమని నా మీద విశాల్‌ ఒత్తిడి చేశారు.
ఆయన వల్లే చేశాను. ఆయన మాట విని ఉండకుండా ఉంటే ఇంత మంచి పాత్రను మిస్ అయ్యేవాడ్ని. సినిమాకు విశాల్ హీరోనే అయినా.. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఇలాంటి కాన్సెప్ట్, కొత్త పాయింట్‌తో ఇది వరకు ఎన్నడూ సినిమా రాలేదు. అధిక్ స్క్రీన్ ప్లే, ఇందులో చేసిన ఎడిటింగ్ అంతా కొత్తగా ఉంటుంది. సునిల్ గారు నాకు మంచి మిత్రులు. జీవీ ప్రకాష్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. నిర్మాత వినోద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. నేనే కష్టపడి ఈ సినిమాకు తెలుగులోనూ డబ్బింగ్ చెప్పుకున్నాను. అది తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. వినాయక చవితికి అందరూ ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.
 బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ..* ‘విశాల్ గారు ఎప్పుడూ కొత్త సినిమాలను చేస్తుంటారు. ఆయన తన బ్యానర్‌లో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు విశాల్‌కు థాంక్స్. ఎస్ జే సూర్య మంచి పాత్రను పోషించారు. సునిల్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు మంచి పాత్రలను ఎంచుకుంటున్నారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తెలుగు డిస్ట్రిబ్యూటర్లందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అతి పెద్ద విజయం కాబోతోంది’ అని అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News